అక్కడికెళ్లాక.. శక్తి వచ్చింది

అక్కడికెళ్లాక.. శక్తి వచ్చింది
తొలిసినిమా ‘ఎవడే సుబ్రహ్మణ్యం’లో అందమైన ప్రయాణం చూపించారు. మలి చిత్రం ‘మహానటి’లో సావిత్రి జీవన ప్రయాణాన్ని ఆవిష్కరించారు. కేవలం రెండు చిత్రాలతోనే తనదైన ముద్రవేసిన దర్శకుడు నాగ్‌ అశ్విన్‌కు ప్రయాణాలంటే చాలా ఇష్టం. ప్రతి ప్రయాణం ఓ అద్భుతమైన అనుభూతి కలిగిస్తుందంటున్న యువ దర్శకుడు విహారితో పంచుకున్న అనుభవాలివి.Related image
* ప్రయాణాలంటే చాలా ఇష్టమట?
దూర ప్రయాణాలంటే చాలా ఇష్టం. ఒకేచోట ఉండిపోతే ఏవో చికాకులు చుట్టుముడుతుంటాయి. ప్రయాణంలో మనసుకు ప్రశాంతత కలుగుతుంది.
* ఎప్పటి నుంచి ఇలా విహరిస్తున్నారు?
కొత్త ప్రదేశాలు చూడాలనీ, కొత్త విషయాలు తెలుసుకోవాలనీ చాలామందికి చిన్నప్పటి నుంచీ ఉంటుంది. నాకూ అంతే. నాకు పదిహేనేళ్లు దాటేవరకు ఏదో ఒకసారి తప్ప హైదరాబాద్‌ దాటింది లేదు. కాలేజ్‌లో చదువుకోవడానికి మణిపాల్‌ యూనివర్సిటీకి వెళ్లాను. నేను బయటకు వెళ్లింది అప్పుడే! అక్కడి నుంచే నా విహారం మొదలైంది.Related image
* ఎవడే సుబ్రహ్మణ్యంలోని దూద్‌కాశి అనుభవాలు పంచుకుంటారా?Related image
మామూలుగా ఆ సినిమా సిమ్లాలోనూ షూట్‌ చేయొచ్చు. కానీ, నాకు హిమాలయాలంటే చాలా ఇష్టం. స్పిరిట్చ్యువల్‌ ఎనర్జీ ఉందక్కడ. ఆ ఆధ్యాత్మికశక్తి కావాలనే అక్కడికి వెళ్లాను. మౌలిక వసతులు కూడా ఉండవు. కానీ, అక్కడికి వెళ్లడం వల్ల ఎనర్జీ వచ్చిందేమో! ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేను. సినిమా షూటింగ్‌ కోసం ఇరవై, ముప్ఫయ్‌ మంది వెళ్లాం. వారిలో చాలామంది దేశవిదేశాలు చుట్టేస్తుంటారు! కానీ, ఎప్పుడు కలిసినా హిమాలయా జర్నీని గుర్తుచేయకుండా ఉండలేరు.
* విహారంలో టెక్నాలజీని ఉపయోగిస్తారా..?Related image
తప్పకుండా! ఇప్పుడు పుణె దగ్గరున్న పంచ్‌గనిలో ఉన్నాను. ఇక్కడ ఎక్కడ ఉండాలో యాప్స్‌ ద్వారా తెలిసిపోతుంది. రివ్యూలు చూసుకొని ఎంచుకుంటే ఈజీగా ఉంటుంది.

(74)

Leave a Reply